- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జనసైనికులను ఎప్పటికీ మర్చిపోను: పవన్ కల్యాణ్
దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభను సక్సెస్ చేసిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక నోట్ విడుదల చేశారు. ‘‘విజయవాడ నుంచి మొదలైన వారాహి యాత్రను, మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ 10 ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దారి పొడవునా హారతులిచ్చి ఆశీర్వదించిన ఆడపడుచులను, సాదర స్వాగతం పలికిన జనసేన శ్రేణులను ఎప్పటికీ మర్చిపోను.
సభకు అశేషంగా హాజరైన జన సైనికులు, వీర మహిళలకు, పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. వారాహి యాత్ర, సభ ప్రాంగణంలో సేవలు అందించిన వాలంటీర్లకు అభినందనలు. వారాహి యాత్ర, సభ నిర్వాహణలో పాలు పంచుకున్న కార్యక్రమాల నిర్వాహణ కమిటీకి, పార్టీ అన్ని విభాగాల నాయకులకు, ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిజేస్తున్నాను. సభకు సహకరించిన పోలీసులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు ప్రత్యేక కృతజ్ఞతలు.’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.