పిరికి మాటలు మాట్లాడకండి.. వినకండి: జనసేన చీఫ్ Pawan kalyan

by Satheesh |   ( Updated:2023-01-23 10:50:55.0  )
పిరికి మాటలు మాట్లాడకండి.. వినకండి: జనసేన చీఫ్ Pawan kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆయనకు అంజలి ఘటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నేతాజీ పోరాట స్ఫూర్తిని నవతరం అందిపుచ్చుకోవాలని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం ప్రతి తరాన్నీ జాగృతం చేస్తోందని ప్రశంసలు కురిపించారు. పిరికి మాటలు మాట్లాడకండి.. వినకండి.. అవి మీ జీవిత గమనానికి ఆటంకమవుతాయని.. ఎదుటి వారికి పిరికితనం నూరిపోస్తే.. మీరు పిరికి వారు అవుతారని ఉత్తేజం చేసిన ఆ యోధుని స్ఫూర్తి వచనాలను నవతరం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మన చుట్టూ జరుగుతోన్న అన్యాయాలు, అక్రమాలపై గొంతు వినిపించడంలో అధైర్యం వదిలి మాట్లాడిన రోజున కచ్చితంగా పాలకుల వైఖరి మారుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : 21 దీవులకు పరమవీర పురస్కార గ్రహీతల పేర్లు నామకరణం చేసిన PM

Next Story

Most Viewed