- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్ విమర్శల లోగుట్టు బయటపెట్టిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో ఓటేసే వారే కరువయ్యారని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు , శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్డ్ రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ ఎన్ని పర్యటనలు చేసినా ఎలాంటి వేషాల్లో వచ్చినా ప్రజలు పట్టించుకోరన్నారు. ఆదివారం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీడియాతో మాట్లాడారు. వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్‌ను ప్రజలు పట్టించుకోవడం లేదని అందువల్లే వివాదాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వలంటీర్లు రాష్ట్రప్రజలకు ఎంతో ఉదారంగా సవేలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాంటి వారిపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. వలంటీర్లు సేకరిస్తున్న డేటా దుర్వినియోగం అవుతున్నాయన్న పవన్ వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదన్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేని నిలదీశారు. ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పట్టించుకునే స్థితిలో లేరని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో దుకాణం సర్దేసుకున్న టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకోవడం చూస్తున్నారని ఇక జనసేన పరిస్థితి అంతేనంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సెటైర్లు వేశారు.