- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెడికో ప్రీతి మరణం అత్యంత బాధాకరం: Pawan Kalyan
దిశ, డైనమిక్ బ్యూరో: పీజీ వైద్య విద్యార్థిని డా.ప్రీతి మరణం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన డా. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రీతి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకొంటే హృదయం ద్రవించింది. తమ బిడ్డను సైఫ్ వేధిస్తూ, కించపరుస్తూ ఉన్నాడని తల్లితండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ యాజమాన్యం బాధ్యులపై సరైన రీతిలో స్పందించి ఉంటే ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి. కళాశాలల్లో ముఖ్యంగా మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలి. సీనియర్ విద్యార్థుల ఆలోచన ధోరణి మారాలి. కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకుని తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి’ అని యువతకు పవన్ కల్యాణ్ సూచనలు చేశారు.
డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/MVkSMsjn34
— JanaSena Party (@JanaSenaParty) February 27, 2023