- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం పీఠం నీదా? నాదా?: పవన్ కల్యాణ్‌కు పోటీగా మహిళా నేత
దిశ, డైనమిక్ బ్యూరో : రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. సమయాన్ని బట్టి రాజకీయ సమీకరణాలు అన్నీ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. నిన్న కింగ్ అయిన వారు నేడు నామ్ కే వాస్తే అయినా ఆశ్చర్చ పోవాల్సిన పనిలేదు. నిన్న మెున్నటి వరకు కింగ్ మేకర్అనుకున్న వాళ్లు సైతం కిగ్ అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాలిటిక్స్‌లో ఇవన్నీ సహజంగానే చూస్తూ ఉన్నాం. ఈ కింగ్, కింగ్ మేకర్ ఏంటా అని ఆలోచిస్తున్నారు కదూ. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారని అంతా ప్రచారం జరిగింది. అంతేకాదు బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ అని అంతా అనుకుంటున్నారు. అనుకోవడం ఏంటి మాజీ బీజేపీ చీప్ సోము వీర్రాజు ఇలాంటి ప్రకటనే చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. బీజేపీ రధసారథి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ కొత్త ప్రచారం జరుగుతుంది. దీంతో పవన్ కల్యాణ్ భవితవ్యంపై ఆందోళన కలుగుతుంది. అటు జనసైనికులు సైతం బీజేపీ ఈ ప్రతిపాదన తీసుకువస్తే కటీఫ్ చెప్పడం మంచిదని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొడుతున్నారు.
దూసుకెళ్తున్న పురంధేశ్వరి
బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఇదివరకే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. సోము వీర్రాజు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. దీంతో జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు. అప్పటి వరకు బీజేపీతో అసహనంగా ఉన్న జనసేన నేతలు నాటి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటనతో కాస్త శాంతించారు. అయితే ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది డిసైడ్ చేయాల్సింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఇప్పటి వరకు బీజేపీ అగ్రనాయకత్వం ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంతలో బీజేపీ పగ్గాలను ఎన్టీఆర్ తనయ, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి అప్పగించారు. నాడు పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన సోము వీర్రాజు పదవిపోయి నామమాత్రుడిగా మారిపోయారు. బీజేపీ పగ్గాలు చేపట్టిన దగ్గుబాటి పురంధేశ్వరి ఇక దూకుడు పెంచారు. వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక్కోరోజు ఒక్కో అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ఉతికి ఆరేస్తున్నారు. పురంధేశ్వరికి వైసీపీ నేతలు, మంత్రులు కౌంటర్ ఇస్తున్నా అందుకు ధీటుగా పురంధేశ్వరి మళ్లీ విరుచుకుపడుతున్నారు. వరుస ప్రెస్‌మీట్‌లు పర్యటనలతో కార్యకర్తల్లో దగ్గుబాటి పురంధేశ్వరి ఉత్సాహం నింపుతున్నారు.
పవన్ వర్సెస్ పురంధేశ్వరి
ఏపీలో బీజేపీకి అంతగా ఓటు బ్యాంకు లేదు. ఈ నేపథ్యంలోనే ఏపీలో పాగా వేసేందుకు జనసేనతో పొత్తు పెట్టుకుంది కమలదళం. పవన్ కల్యాణ్ ద్వారా ఏపీలో తన ఉనికిని చాటుకోవాలని ఎత్తుగడలో భాగంగానే ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంది. నిన్న మెున్నటి వరకు పనిచేసిన బీజేపీ అధ్యక్షులు స్ట్రాంగ్ నాయకులు అయినప్పటికీ వారిపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ గత అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీకి ఫేవర్‌గా వ్యవహరించారనే ప్రచారం ఉంది. కన్నా లక్ష్మీనారాయణ స్ట్రాంగ్‌గా పనిచేసినప్పటికీ ఆయన అంతగా నిలదొక్కుకోలేకపోయారు. అయితే తాజాగా దగ్గుబాటి పురంధేశ్వరి రావడం ఆమె వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో విరుచుకుపడుతున్నారు. సాక్ష్యాధారాలతో సహ..నెంబర్లతో వైసీపీని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు బీజేపీ వాయిస్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీలో కొత్త ఆలోచన మెదిలినట్లు తెలుస్తోంది. దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ-జనసేన సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ-జనసేన సీఎం అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరిని ప్రకటిస్తే ఎట్టి పరిస్థితిలో జనసేన పొత్తు ఉండదన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో ఆ ప్రచారం కేవలం కల్పితం మాత్రమేనని కొందరు అంటున్నారు. కానీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పీడు, ఎన్టీఆర్ వారసురాలిగా ఏపీ ప్రజలు ఆదరిస్తారని..అలాంటప్పుడు ఆమె సీఎం అభ్యర్థిగా ఎందుకు ఉండకూడదని ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. అయితే జనసేనతో పొత్తు కాకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే అప్పుడు సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోవాలని పొత్తులో అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన డిమాండ్ చేస్తోంది. మరి ఈ వార్ పోరుకు బీజేపీ వార్ రూమ్ ఎలా ఎండింగ్ చెప్తుందో వేచి చూడాలి.
Read More: AP News: ఏపీ అప్పులపై పురంధేశ్వరి ఆందోళన.. కీలక వ్యాఖ్యలు
ప్రతిపక్షాలకు నోటీసులిచ్చేందుకేనా మహిళా కమిషన్: బీజేపీ నేత సాధినేని యామిని