ఒక పీకే అయిపోయాడు.. ఇప్పుడు మరో పీకే వచ్చాడు: మంత్రి జోగి రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-03-04 11:06:19.0  )
ఒక పీకే అయిపోయాడు.. ఇప్పుడు మరో పీకే వచ్చాడు: మంత్రి జోగి రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వేలన్నీ వైసీపీకే అనుకూలంగా ఉన్నప్పటికీ పీకే మాత్రం జగన్‌కి ఘోరమైన ఓటమి తప్పదంటూ కామెంట్ చేశారు. తాజాగా, ఆయన హైదరాబాద్‌లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఏపీలో టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ప్రకటించారు. దీంతో ఆ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వైరల్‌గా అవుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేతలు, మంత్రులు ప్రశాంత్ కిషోర్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయన వ్యాఖ్యలకు మంత్రి జోగి రమేష్ కౌంటర్‌ ఇచ్చారు. ఒక పీకే అయిపోయాడు అనుకుంటే.. ఇప్పుడు మరో పీకే వచ్చాడని ఎద్దేవా చేశారు. ఐ ప్యాక్‌కి, ప్రశాంత్ కిషోర్‌కు ఏ మాత్రం సంబంధం లేదని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చిన స్క్రిప్ట్‌నే పీకే చదువుతున్నాడని ధ్వజమెత్తారు. ఎంత మంది పీకేలు వచ్చిన జగన్ గెలుపును ఆపలేరని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.

Read More..

బీజేపీ మార్గదర్శకత్వంలో జనసేనాని..మారిన పవన్ కళ్యాణ్ వ్యూహం?

Advertisement

Next Story