Tension: గణేశ్ నిమజ్జనంలో ఘర్షణ.. కత్తులతో దాడులు

by srinivas |
Tension: గణేశ్ నిమజ్జనంలో ఘర్షణ.. కత్తులతో దాడులు
X

దిశ, వెబ్ డెస్క్: పాత గొడవలు గణేశ్ నిమజ్జనంలో (Immersion of Ganesh) ఉద్రిక్తతలకు దారి తీశారు. యువకుల మధ్య గొడవ పెరిగి ఇరువర్గాల ఘర్షణగా మారింది. కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని గుంటూరు ప్రభుత్వం ఆస్పత్రికి (Guntur Government Hospital) తరలించారు. ఈ ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి వడ్లవల్లిలో (Sattenapalli Vadlavalli) జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరస్పరం ఫిర్యాదులతో రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారు. వడ్లవల్లిలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోసారి పునరావృతం కాకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed