భక్తులకు శుభవార్త చెప్పిన అధికారులు.. రథ సేవలో భక్తులకు గొప్ప అవకాశం..

by Indraja |
భక్తులకు శుభవార్త చెప్పిన అధికారులు.. రథ సేవలో భక్తులకు గొప్ప అవకాశం..
X

దిశ, అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. కాగా అన్నవరం సత్యన్నారాయణ స్వామీ భక్తులకు అధికారులు శుభవార్త చెప్పారు. ఇటీవల దాత సహకారంతో నూతనంగా తయారు చేయించిన టేకు రథంలో స్వామి అమ్మవార్లను ప్రతి ఆదివారం ఆలయం చుట్టూ ఊరేగింపుగా నిర్వహించే రథ సేవలో భక్తులు పాల్గొనేందుకు అధికారులు అవకాశం కల్పించారు.

కాగా ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే స్వామి అమ్మవార్ల రథ సేవలో పాల్గొనాలి అనుకునే భక్తులు రూ / 2500 రుసుము చెల్లించి టికెట్ తీసుకుపోవాలని అధికారులు తెలిపారు. ఇక టికెట్ తీసుకుని రథ సేవలో పాల్గొనే దంపతులిద్దరికీ కండువా కప్పి గోత్రనామాలతో సంకల్పం చేయబడుతుంది పేర్కొన్నారు. అలానే స్వామి అమ్మ వార్ల అంతరాలయం దర్శనం, వేద పండితుల ఆశీర్వచనం, కండువా, రవిక, స్వామి వారి గోధుమ నూక ప్రసాదం వంటివి అందించడం జరుగుతుందని సహాయ కార్య నిర్వహణ అధికారి డివిఎస్ కృష్ణారావు తెలిపారు.

కాగా ఆలయ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ఈ ఆదివారం నుండే అమలు కానుందని స్పష్టం చేశారు. అన్నవరం సత్యనారాయణ సన్నిధిలో ఇప్పటి వరకు రథ సేవ సాధారణంగా జరిగేది.

Advertisement

Next Story