వివేకా హత్యకేసు దర్యాప్తు సంస్థలపై ఎవరి జోక్యం ఉండకూడదు : వైఎస్ సునీత

by Seetharam |   ( Updated:2023-08-08 13:10:56.0  )
YS Sunitha Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది అని ఆయన తనయ వైఎస్ సునీతారెడ్డి వెల్లడించారు. దర్యాప్తు సంస్థలపై ఎవరి జోక్యం ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి జయంత్రి సందర్భంగా పులివెందులలో తన తండ్రికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న రాజకీయ ఆరోపణలను ఆమె ఖండించారు. ఈ సందర్భంగా తన తండ్రి తనతో చెప్పిన పలు అంశాలను ప్రస్తావించారు. గతంలో మా నాన్న కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు. ఎవరైనా మనల్ని పొగిడితే పెద్దగా పట్టించుకోవద్దని. అలాగే విమర్శిస్తే సీరియస్ గా తీసుకోవాలని చెప్పేవారు’ అంటూ వైఎస్ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More..

సీబీఐ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.. వైఎస్ సునీత

Advertisement

Next Story

Most Viewed