- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పేదలకు శుభవార్త.. త్వరలో 2 లక్షల 30 వేళ ఇళ్లు..!

దిశ, వెబ్ డెస్క్: పేదలకు మంత్రి నారాయణ(Minister Narayana) గుడ్ న్యూస్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం(Atmakur Constituency)లో పర్యటించిన ఆయన టిడ్కో ఇళ్ల(Tidco Houses)పై కీలక ప్రకటన చేశారు. 2 లక్షల 30 వేల ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. పేద కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఎన్నో దేశాలు తిరిగి టిడ్కో ఇళ్లను తీసుకొచ్చామని చెప్పారు. తమ హయాంలో కట్టిన ఇళ్లను కూడా గత ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేయలేకపోయిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం(Union Government) ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులును సైతం జగన్(Jagan) ఇతర పథకాలకు మళ్లించారని నారాయణ మండిపడ్డారు.
2019లో ఆసియా అభివృద్ధి బ్యాంకు(Asian Development Bank) రూ. 5,350 కోట్లు ఇస్తే వాటికి జగన్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదని నారాయణ విమర్శించారు. ప్రస్తుతం కేంద్రంతో మాట్లాడి ఆ నిధులను తీసుకొస్తామన్నారు. అమృత్ పథకం కింద తాగునీటికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. త్వరలో ఆత్మకూరు నియోజకవర్గంలోని 63 కాలనీల్లో ఆలయాలు నిర్మిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.