ఏపీ బీజేపీ దూకుడు.. అన్ని స్థానాలకు కమిటీలు నియామకం..!

by srinivas |   ( Updated:2024-01-10 10:13:19.0  )
ఏపీ బీజేపీ దూకుడు.. అన్ని స్థానాలకు కమిటీలు నియామకం..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలకు మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయనుంది. అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు సంస్థాగత కమిటీలను వేయనుంది. అంతేకాకుండా 32 మందితో ఎన్నికల కమిటీని నియమించనునుంది. ఈ ప్రక్రియను సంక్రాంతి తర్వాత నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.


సోము వీర్రాజు కీలక ప్రకటన

ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక ప్రకటన చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కటి నుంచి చేస్తానని చెప్పారు. కానీ తనకు రాజమండ్రి నుంచి పోటీ చేయాలని ఉందని, అధిష్టానం తన నిర్ణయానికి ఓకే చెబితే తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

ప్రభుత్వంపై సోము వీర్రాజు నిప్పులు

ఇక సీఎం జగన్ ప్రభుత్వంపై సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. అంతేకాదు నవరత్నాలపై ఆయన విమర్శలు కురిపించారు. వైఎస్ జగన్ ప్రవేశ‌పెట్టిన నవతరత్నాలు కంటి తుడుపు చర్యగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జగన్ చేసినవ్నీ అనాలోచి నిర్ణయాలని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల తీరుతో రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం ఊడిపోయే పరిస్థితి నెలకొందని జోస్యం చెప్పారు. కేంద్ర పథకాలను తాను చేపడుతున్నట్లు వైఎస్ జగన్ కలరింగ్ ఇస్తున్నారని సోము వీర్రాజు విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed