TTD : తిరుమల ఉద్యోగులకు కొత్త నిబంధన !

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-12 06:56:41.0  )
TTD : తిరుమల ఉద్యోగులకు కొత్త నిబంధన !
X

దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ(TTD) నూతన చైర్మన్ బీఆర్.నాయుడు(B.R. Naidu) నూతన పాలక వర్గం తిరుమలTirumala ప్రతిష్టతను, పవిత్రతను పెంచే క్రమంలో పలు సంస్కరణలు..నిబంధనలు అమల్లోకి తీసుకోస్తుంది. తిరుమలలో డ్యూటీలో ఉన్న ఉద్యోగులు నేమ్ ప్లేట్‌తో ఉన్న బ్యాడ్జీ(Badge with name plate)ని ధరించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చైర్మన్ బీఆర్.నాయుడు ట్వీట్ చేశారు. స్వామివారి నమూనాతో కూడిన ఉద్యోగి నేమ్ ప్లేట్ బ్యాడ్జీని ఉద్యోగులు విధిగా ధరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ బ్యాడ్జీ ద్వారా క్యూలైన్లలో భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులను గుర్తించవచ్చని టీటీడీ భావిస్తోంది. ఈ నెల 24న జరిగే పాలకవర్గం సమావేశంలో ఈ నూతన నిర్ణయాన్ని ఆమోదించి అమల్లోకి తీసుకరానుందని టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి వెల్లడించారు.

శ్రీవారి నమూనాతో కూడిన ఉద్యోగి నేమ్ బ్యాడ్జీని ధరించడం ఉద్యోగులు గౌరవంగా భావించాలన్నారు. టీటీడీ తీసుకునే ఏ నిర్ణయమైన భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకేనని స్పష్టం చేశారు. ఉద్యోగులు భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాని తెలిపారు. తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు, క్షేత్ర పవిత్రతను కాపాడేందుకే పలు సంస్కరణలకు నూతన పాలక వర్గం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించింది. తాజాగా టీటీడీ తీసుకుంటున్న సంస్కరణల పట్ల భక్తుల్లో సర్వత్రా వ్యక్తమవుతోంది.

Advertisement

Next Story