- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
First Time: ఏపీ విద్యాశాఖలో కొత్త విధానం.. ఈ ఏడాది నుంచే అమలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ విద్యాశాఖలో కొత్త విధానాన్ని తీసుకురానున్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కొత్త విధానానికి విద్యాశాఖే ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసింది. ఇప్పుడు పాఠ్య పుస్తకాల విషయంలో విద్యాశాఖ అధికారులు సంచలన విధానానికి శ్రీకారం చుట్టారు. ఇక నుంచి పాఠ్యపుస్తకాలను ఆన్ లైన్‌లో ఉంచనున్నారు. విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఇలా డౌన్ లోడ్ చేసుకున్న పుస్తకాలను వాణిజ్య అవసరాలకు ఉపయోగించకుండా విద్యాశాఖ నిషేధం విధించింది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇంటర్ రిజల్ట్స్ విడుదల.. బాలికలే టాప్
కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం.. రెండో సవత్సరం ఇంటర్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో కలిసి ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 61శాతం ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్ విద్యార్థుల విషయానికి వచ్చేసరికి 72శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 65 శాతం, 51శాతం బాలురు పాస్ అయ్యారు. ఇక సెకండ్ ఇయర్‌లో బాలికలు 75 శాతం బాలురు, 56 శాతం పాస్ అయ్యారు. మొత్తానికి ఇంటర్ పరీక్షలలో బాలికలే పై చేయి సాధించారని మంత్రి బొత్స తెలిపారు.
కృష్ణా జిల్లాదే తొలిస్థానం
ఇక ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా 77 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో కృష్ణా 83 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్ పరీక్షలు నిర్వహించిన 22రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసినట్లు మంత్రి బొత్స తెలిపారు. పరీక్షలు ముగిసిన వెంటేనే స్పాట్ వేల్యూషన్ నిర్వహించినట్లు తెలిపారు. గత సంవత్సరం కంటే మిన్నగా సంతృప్తిగా పరీక్షలు, పేపర్ వేల్యూషన్ నిర్వహించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
వెబ్ సైట్ ద్వారా ఫలితాలు చెక్ సుకోవచ్చు
విద్యార్థులు bieap.apcfss.in. ap. అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు అవకాశం కల్పిస్తున్నామని... పాస్ కాని వారికి సప్లమెంటరి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అటు ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 3వరకు జరిగాయి. ఇక సెకండియర్ విషయానికి వస్తే మార్చి 16 నుండి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.