జూన్ 4 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో NDA సర్కార్: ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
జూన్ 4 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో NDA సర్కార్: ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజమండ్రిలోని వేమగిరిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ తెలియదని.. అవినీతి నిర్వహణే తెలుసని ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ పూర్తి మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిందని.. కానీ ఇప్పుడు ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేస్తుందని మండిపడ్డారు. ఏపీలో పెద్ద మద్యం సిండికేట్‌గా నడుస్తోందని ఆరోపించారు.

వైసీపీ సర్కార్ ఇసుక, మద్యం మాఫియాను నడిపిస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉంది.. అభివృద్ధికి మాత్రం బ్రేక్ వేసిందని ఎద్దేవా చేశారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వైసీపీ ఆపేసిందన్నారు. జూన్ 4 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అనంతరం వికాసిత్ ఆంధ్రప్రదేశ్, వికాసిత్ భారత్ కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు. పోర్టులు, హార్బర్లు, హైవేలతో ఏపీ రూపురేఖలు మారనున్నాయని చెప్పారు.

Next Story

Most Viewed