Breaking: శంఖారావం చేయనున్న నారా లోకేష్.. ఎక్కడివరకు వినిపించనుంది..?

by Indraja |
Breaking: శంఖారావం చేయనున్న నారా లోకేష్.. ఎక్కడివరకు వినిపించనుంది..?
X

దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓ వైపు అధికార పార్టీకి విపక్షాలకు మధ్య మాటల యుధం, మరో వైపు పార్టీల ప్రచారాలతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కాకపుటిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర, సిద్ధం పేరుతో భహిరంగ సభలు నిర్వహించాగా.. టీడీపీ అధినేత రాకదిలి రా అని ప్రజలకు పిలుపునిచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజగా నారా లోకేష్ రానున్న ఎన్నికల నేపథ్యంలో తాను కూడా భహిరంగ సభలు నిర్వహించినందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

గతంలో తాను చేపట్టిన యువగళం పాదయాత్ర చంద్రబాబు అరెస్ట్ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో పాదయాత్ర కవర్ కానీ నియోజకవర్గాల్లో నారాలోకేష్ పర్యటించనున్నారు. ఈ నెల 11 వ తేదీ నుండి శంఖారావం పేరుతో లోకేష్ ప్రజల్లోకి రానున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాదయాత్ర కవర్ కానీ నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించి అక్కడ కార్యకర్తలతో, ప్రజలతో మమేకం కానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ట్రైలర్ ను ఈ రోజు ఏపీటీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.

ఇక ఇప్పటికే తేడుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా, బాబు ష్యురీటి భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమాలను చేపట్టి రానున్న ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో వివరించారు. ఇక ఇప్పుడు నారా లోకేష్ తాను చేపట్టిన యువగళం పాదయాత్ర కవర్ కానీ నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో పర్యటించి ఈ నియోజకవర్గాల్లోని కార్యకర్తలను, ప్రజలను చైతన్యపరచనున్నారు.

Advertisement

Next Story