Breaking: భయం మా బైయోడేటాలోనే లేదు బ్రదర్..నారా లోకేష్

by Indraja |
Breaking: భయం మా బైయోడేటాలోనే లేదు బ్రదర్..నారా లోకేష్
X

దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు విజయనగరం జిల్లా రాజాంలో శంఖారావం బహిరంగ సభను నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో మాట్లాడిన తెలుగుదేశం పార్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబులకే భయపడని కుటుంబం తమదని.. మీరు పెట్టె చిల్లర కేసులకు భయపడతామా? జగన్ అని ప్రశ్నిచారు. అసలు భయం మన బైయోడేటాలో ఉందా బ్రదర్ అని కార్యకర్తలని అడిగారు.

మీ అందరి బాలయ్య తనకు మాత్రమే ముద్దుల మామయ్యని పేర్కొన్నారు. ఇక ఏ చట్టాన్ని ఉల్లంఘించి, ఆ చట్టాన్ని చుట్టంగా మార్చుకుని తమని ఇబ్బంది పెట్టిన వైఎసీపీ నాయకుల పేర్లు ఎర్ర బుక్ లో ఉన్నాయని.. మరో రెండు నెలలు ఓపిక పట్టమని.. టీడీపీ అధికారంలోకి రాగానే వాళ్లపై న్యాయ విచారణ జరిపించి జైలుకు పంపంచె బాధ్యత తాను తీసుకుంటానని కార్యకర్తలకు తెలిపారు. ఇక తన ఎర్రబుక్కు చూసి వైసీపీ బయపడుతుందని.. లోకేష్ ఊరురూరు ఎర్రబుక్ చూపిస్తున్నాడు అందుకే లోకేష్ పైన నాన్ బెయిల్ వారెంట్ ఇష్యు చెయ్యాలని వైసీపీకి న్యాయమూర్తిని కోరారని పేర్కొన్నారు.

ఎందుకు మీకు అంత భయం.. తప్పు చేసిన వాళ్ళ పేర్లు బుక్ లో రాసుకున్న అని చెప్పాను..దానికెందుకు అంత భయపడుతున్నారని ప్రశ్నించారు. 2019 ముందు వరకు అన్ని రకాలుగా ఎగతాళి చూశారుగా మరి ఇప్పుడు ఎందుకు నన్ను చూస్తే అంత భయం అని ఎద్దేవా చేశారు. వారెంట్ ఎందుకు ఇక్కడే రాజాం లో నిలబడుతున్న రా అరెస్ట్ చెయ్యి అని వైసీపీకి సవాల్ విసిరారు. మీ జగన్ లాగ పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ తాను కాదని మండిపడ్డారు. మీ జగన్ లాగా ఊరికి వస్తే చెట్లన్నీ నరికే బ్యాచ్ కాదని.. దమ్ము ధైర్యంతో ప్రజల మధ్యలో తాను ఉన్నానని పేర్కొన్నారు.

Advertisement

Next Story