- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: సింహాసనం పై శునకం.. నారాలోకేష్ సంచలన వ్యాఖ్యలు
దిశ డైనమిక్ బ్యూరో: శంఖారావం సభలో మాట్లాడాడిన నారా లోకేష్ సీఏం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మొన్న ఒక సభలో మాట్లాడుతూ వైసీపీ నేతలు, కార్యకర్తలు చొక్కా మడత పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. నిన్న శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ కుర్చీ మడత పెట్టేందుకు పసుపు సైన్యం, సిద్ధంగా ఉందని జగన్ మాటలకు కౌంటర్ ఇచ్చారు.
అయితే లోకేష్ మాటలకూ వైసీపీ నేతల మనోభావాలు దెబ్బ తిన్నాయని.. అయినా జగన్ కూర్చుంది కుర్చీ పైన కాదు సింహాసనం పై అని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. కాగా అంబటి వ్యాఖ్యలపై స్పందించిన నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి అన్నట్లు అది సింహాసనమే అని.. అయితే ఆ సింహాసనం పై కూర్చుంది మాత్రం శునకం అని జగన్ ని దుయ్యబట్టారు.
ఇక ఆ శునకాన్ని తరిమితరిమి కొట్టాలని తాను అంటున్నానని.. ఒప్పుకుంటావా..? అని అంబటిని ప్రశ్నించారు. జగన్ ఎన్నికల ముందు నవరత్నాలు అన్నారు.. అయితే ఆ నావరత్నాలు కాస్త ఇప్పుడు నవ మోసాలుగా మారింది అని పేర్కొన్నారు. అలానే ఎన్నికల ముందు ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటె అంతమందికి అమ్మ ఒడి అన్నారని.. ఇప్పుడేమో ఇంటికి ఒక్కరికే అంటున్నారని ఆరోపించారు.
ఇక ఎన్నికల ముందు సపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తరువాత మాత్రమే ఓట్లను అడుగుతానని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఊర్లు కాదుకదా వీధి వీధికి మద్యం ఏరులై పారుతుందని మండిపడ్డారు. అలానే నలభై ఐదు ఏళ్ళ వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు పెన్షన్ ఇస్తాను అని చెప్పి జగన్ మాటతప్పారని ఆరోపించారు.