- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండోరోజు: సీఐడీ విచారణకు హాజరైన నారా లోకేశ్
దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే మంగళవారం సీఐడీ విచారణకు హాజరైన లోకేశ్ బుధవారం నాడు రెండోరోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాలపై లోకేశ్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. మంగళవారం సుమారు ఆరున్నర గంటలపాటు లోకేశ్‌ను విచారించారు. అనంతరం బుధవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మంగళవారం సీఐడీ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి పలు ప్రశ్నలను లోకేశ్‌కు సంధించింది. 50 ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఏం జరిగిందో అడిగారని.. మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన జీవోఎం వివరాలపై సీఐడీ ఆరా తీసింది.కక్ష సాధింపు తప్ప...ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ ఎఫ్ఐఆర్‌లు పెట్టారు అని నారా లోకేశ్ విచారణ అనంతరం వ్యాఖ్యానించారు. తనను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని లోకేశ్ ఆరోపించారు.