ఓటుతో అలా చేయండి.. ప్రజలకు నారా భువనేశ్వరి కీలక పిలుపు

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-08 07:13:43.0  )
ఓటుతో అలా చేయండి.. ప్రజలకు నారా భువనేశ్వరి కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఫైర్ అయ్యారు. బుధవారం చంద్రబాబుకు మద్దతుగా భువనేశ్వరి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని పునాదులతో సహా పెకిలించాలన్నారు. జగన్ పాలనలో మహిళలకు భద్రత కరువు అయిందని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యతో యువత ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. నిరుద్యోగం వల్ల యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వైసీపీ నేతల దోపీడీకి ప్రజలు బలవుతున్నారన్నారు. మీ ఓటుతో ఫ్యాన్ రెక్కలు ఊడి కిందపడాలి అని నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేశారని తెలిపారు.

Read More : గొడ్డలితో నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్...వదిన భారతిపై YS షర్మిల సెన్సేషనల్ కామెంట్స్

Advertisement

Next Story