2024 Elections: జనసేన నాయకులకు నాగబాబు కీలక పిలుపు

by srinivas |   ( Updated:2024-03-18 14:23:42.0  )
2024 Elections: జనసేన నాయకులకు నాగబాబు కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ కూడా విడులైంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ఎన్నికల వ్యూహంపై ఆయా పార్టీల అధినేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. వైసీపీ ఒంటిరిగా ఎన్నికలకు వెళ్తుంటే.. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను ఉద్దేశించి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగాబాబు కీలక సూచనలు చేశారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, గోదావరి జిల్లాలకు చెందిన నాయకులతో గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పోటీకి అసరమైన ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాల ప్రణాళికలు ముమ్మరం చేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారానికి రావాలని నాయకులు తనను కోరుతున్నారని.. తప్పనిసరిగా పాల్గొంటానని చెప్పారు. జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ, టీడీపీ, అభ్యర్థుల పోటీ చేసే నియోజకవర్గాల్లోనూ ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. పొత్తులో భాగంగా పలు చోట్ల సీట్లు సర్దుబాటు చేయలేకపోయారని.. విశాల దృక్పథంతో ఆలోచన చేసి కూటమి విజయంలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. పార్టీకోసం నిలిచిన వారికి కూటమి ప్రభుత్వంలో తగిన గౌరవం, గుర్తింపు ఇస్తామని నాగబాబు హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed