- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ములాఖత్: చంద్రబాబుతో లోకేశ్, భువనేశ్వరి, బ్రహ్మణిల భేటీ

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రహ్మణిలు కలిశారు. ములాఖత్‌లో భాగంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడేందుకు 45 నిమిషాల పాటు సమయం ఇచ్చారు అధికారులు. చంద్రబాబు నాయుడు యోగక్షేమాల గురించి కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు.మరోవైపు ఏసీబీ కోర్టులో వాదనలు, హౌస్ రిమాండ్ పిటిషన్ తీర్పు, సోమవారం జరిగిన బంద్ ఇతరత్రా అంశాలపై లోకేశ్‌ను చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో సెంట్రల్ జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు. అంతకు ముందు ఉండవల్లిలోని తమ నివాసం నుంచి నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి, నందమూరి రామకృష్ణలు చేరుకున్నారు. నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, చిన్నల్లుడు శ్రీభరత్‌లు సైతం లోకేశ్ క్యాంప్ వద్దకు చేరుకున్నారు. వీరంతా లోకేశ్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.