- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన మట్టి మాఫియా.. పలువురిపై ఐరన్ రాడ్లతో దాడులు
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రాపురంలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. ప్రభుత్వం మారినా యదేచ్ఛగా మట్టిని తవ్వి అక్రమంగా అమ్ముకున్నారు. గత ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే మట్టి మాఫియా రోజు రోజుకు చెలరేగిపోతోంది. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మీడియా ప్రతినిధులను సైతం వదిలిపట్టలేదు. రామచంద్రాపురంలో ఎక్కడ పడితే అక్కడ మట్టిని తవ్వుకుని అక్రమంగా లక్షలు గడిస్తున్నారు. అయితే మాఫియా ఆగడాలను ప్రశ్నించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై రాడ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా మట్టి మాఫియా తవ్వి అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం వెంటనే స్పందించి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరారు.