బ్రేకింగ్: ఎంపీ YS అవినాష్ రెడ్డి తల్లికి గుండెపోటు

by Satheesh |
బ్రేకింగ్: ఎంపీ YS అవినాష్ రెడ్డి తల్లికి గుండెపోటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. తన తల్లికి గుండెపోటు వచ్చిందని.. ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరుకాలేనని సీబీఐకు లిఖతపూర్వకంగా లేఖ రాశారు. పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రతిలో తన తల్లి చికిత్స పొందుతుందని ఈ పరిణామాల నేపథ్యంలో తాను అక్కడకు వెళ్లాల్సి వచ్చిందని లేఖలో తెలిపారు. ఈ లేఖను తన తరఫు వాదిస్తున్న న్యాయవాదులతో కోఠిలోని సీబీఐ కార్యాలయానికి పంపించారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి ఎంపీ అవినాశ్ రెడ్డి పులివెందులకు బయలుదేరారు.

ఈనెల 19న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు అవినాశ్ రెడ్డి రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం విచారణకు వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో తాను విచారణకు హాజరుకాలేనని సీబీఐకు లిఖతపూర్వకంగా లేఖ రాశారు. హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లిపోయారు. ఈనెల 16న కూడా సీబీఐ విచారణకు హాజరయ్యే అంశంలో చివరి నిమిషంలో ఎంపీ అవినాశ్ రెడ్డి గైర్హాజరయ్యారు.

తాను ముందస్తు షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరుకాలేనని అందుకు నాలుగు రోజులు గడువు ఇవ్వాలని కోరారు. అనంతరం పులివెందుల వెళ్లిపోయారు. తాజాగా మరోసారి చివరి నిమిషంలో విచారణకు గైర్హాజరయ్యారు. ఇకపోతే ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed