Cm Jagan ఎటైనా వెళ్లొచ్చు.. ఎంపీ రఘురామ సెటైర్

by srinivas |   ( Updated:2023-02-09 17:40:34.0  )
Cm Jagan ఎటైనా వెళ్లొచ్చు.. ఎంపీ రఘురామ సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లిందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఏపీ రాజధాని అమరావతియేనని పార్లమెంట్‌లో కేంద్ర పరోక్షంగా స్పష్టం చేసిందని తెలిపారు. విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతి ఏర్పాటు అయ్యిందని అయితే దాన్ని విశాఖకు మార్చాలంటే పార్లమెంట్‌లో చట్టం చేయాల్సి ఉంటుందని కేంద్రం క్లారిటీ ఇచ్చిందని స్పష్టం చేశారు. కావాలనుకుంటే జగన్ విశాఖకు వెళ్లొచ్చని... అవసరం లేని వారు కోటలో ఉన్నా, పేటలో ఉన్నా ఒకటేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.రాజధాని అంశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పారు. ఈ ప్రశ్న అడిగిన విజయసాయిరెడ్డికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు అభినందనలు తెలిపారు.

నన్ను హింసించిన వారికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది

రెండేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు తనకు న్యాయం చేసిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆనందం వ్యక్తం చేశారు. సీఐడీ పోలీసులు జగన్ డైరెక్షన్‌లో తనను దారుణంగా హింసించిన అంశంలో రెండేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు తనకు న్యాయం చేసిందని రఘురాజు అన్నారు. తనను హింసించిన వారికి హైకోర్టు నోటీసులు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. తన ప్రాణాలకు ప్రతిపక్ష నేతలు అండగా ఉన్నారని పేర్కొన్నారు. మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారని, అక్కడ గోల్ఫ్ ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 6వ తరగతి చదివిన వారికి మంత్రి పదవి ఇవ్వొచ్చు కానీ ప్రభుత్వ పథకాలు తీసుకోవాలంటే 10వ తరగతి పాస్ అవ్వాలా?. అని ఎంపీ రఘురామకృష్ణంరాజు సెటైర్లు వేశారు.

Also Read...

టీడీపీలో ఉన్నందుకు గర్వంగా ఉంది: అబ్దుల్ అజీజ్


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed