TDP రూ.10 కోట్లు ఆఫర్ చేసింది: ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-03-26 09:23:11.0  )
TDP రూ.10 కోట్లు ఆఫర్ చేసింది: ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి బేరం నాకే వచ్చిందని అన్నారు. ప్రజా ప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటేయాలని టీడీపీ తనకు పది కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఓటు కోసం తన మిత్రుడు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారని తెలిపారు. అంతేకాకుండా ఓటు వేయడానికి వేళ్లేటప్పుడు అసెంబ్లీ దగ్గర కూడా ఓ రాజుగారు టీడీపీకి ఓటేయమన్నారని.. టీడీపీకి ఓటేస్తే భవిష్యత్‌లో మంచి పొజిషన్ ఉంటుందని చెప్పారు. నా ఓటు అమ్మితే రూ.10 కోట్లు వచ్చేవని.. నాకు డబ్బులు ఎక్కువే వద్దనలేదని.. కేవలం సీఎం జగన్‌ను నమ్మాను కాబట్టి టీడీపీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. సిగ్గు శరం వదిలేస్తే పదికోట్లు వచ్చే ఉండేవని.. కానీ ఒకసారి పరువు పోతే సమాజంలో ఉండలేమని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed