- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap News: ఎమ్మెల్యే పొన్నాడకు నిరసన సెగ.. ఎందుకో తెలుసా..?
దిశ, వెబ్ డెస్క్: ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌కు నిరసన సెగ ఎదురైంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చొల్లంగిలో ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అయితే ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. 45 రోజులుగా ఇళ్ల స్థలాల కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో ఓట్లు అడగేందుకు వచ్చారా అంటూ ప్రశ్నించారు. ఓట్ల కోసమే గుర్తుచ్చామంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్తులపై ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను అడ్డుకుంటే తొక్క తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి ఏదో ఒకటి చేస్తారనే కాదా గత ఎన్నికల్లో ఓటేశామని.. కానీ ఏమీ చేయకుండా ఎన్నికల వస్తున్నాయని ఓట్లు అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. పై తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గుణపాఠం చెబుతామని చొల్లంగి గ్రామస్తులు హెచ్చరించారు.