AP News: మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు పథకం పై మంత్రి కీలక ప్రకటన!

by Jakkula Mamatha |
AP News: మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు పథకం పై మంత్రి కీలక ప్రకటన!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక రాష్ట్రంలోని మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Mandipalli Ramprasad Reddy) చెప్పారు. నాయుడుపేటలో ఇవాళ(గురువారం) మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలకు 3 సిలిండర్లు, 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. మరో 2 నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ(Free Bus Journey) పథకం అమలవుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్లాయని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని మంత్రి వెల్లడించారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు సంబంధించి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి తెలిపారు. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed