- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జగన్ ముందు గోబెల్స్ కూడా పనికిరాడు: మంత్రి అనగాని ఫైర్

దిశ ఏపి బ్యూరో, అమరావతి: పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డిని మించిన గోబెల్స్ ప్రపంచంలోనే లేరని, నిజానికి గోబెల్స్ కూడా జగన్ ముందు దిగదిడుపేనని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. జగన్‌కు ధైర్యం ఉంటే రాజకీయ హత్యల వివరాలు చెప్పగలరా అని ప్రశ్నించారు. నారా లోకేష్ రెడ్ బుక్‌ను చూస్తుంటే జగన్ వెన్నులో వణకు పుడుతోందన్నారు. చేసిన పాపాలకు శిక్ష ఖాయమని తెలుసుకొని సానుభూతి కోసం కూటమి ప్రభుత్వంపై జగన్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఐదేళ్ల ప్రభుత్వ పాలనలోని ఘోరాలన్నింటీనీ ఏడు శ్వేతప్రతాల ద్వారా చంద్రబాబు బయటపెట్టారన్నారు. బాబాయి వివేకా హత్య కేసు, కోడికత్తి కేసు, గులకరాయి కేసుల్లో జగన్ రెడ్డి చేసిన ఫేక్ ప్రచారాన్ని అర్ధం చేసుకున్నారు కనుకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు బుద్దిచెప్పారని అన్నారు. తాను చెప్పే అబద్దాలను జనం ఛీ కోడుతున్నారనే సిగ్గు లేకుండా నవ్వుతూ అబద్దాలు చెప్పడం జగన్ అలవాలు చేసుకున్నారని ఎద్దవా చేశారు. ఎంతో మంది భూములు ఆక్రమించి, అనేక మందిని హింసించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మంచివాడని సర్టిఫికేట్ ఇవ్వడం ఒక్క జగన్‌కు మాత్రమే చెల్లిందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఎద్దేవా చేశారు.