మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-17 09:20:35.0  )
మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) మహాకుంభమేళా(Maha Kumbh Mela)లో పుణ్యస్నానమాచరించారు. సోమవారం తెల్లవారుజామున నారా భార్య బ్రాహ్మణి(Nara Brahmini), కుమారుడు దేవాన్ష్‌(Devansh)తో కలిసి ప్రయాగ్‌రాజ్‌లో స్నానం చేశారు. ఆ తర్వాత వార‌ణాసి(Varanasi) కాల‌భైర‌వ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. అలాగే సాయంత్రం 3.40 గంట‌ల‌కు వార‌ణాసికి కాశీ విశ్వేశ్వ‌ర ఆల‌యాన్ని సంద‌ర్శించి, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. ఆ త‌ర్వాత సాయంత్రం 4 గంట‌ల‌కు విశాలాక్షి దేవాల‌యాన్ని సంద‌ర్శిస్తారు. ఈ ఆల‌యం సంద‌ర్శ‌న అనంత‌రం సాయంత్రం 5.25 గంట‌ల‌కు వార‌ణాసి నుంచి విజ‌య‌వాడ‌కు తిరుగు ప‌య‌ణమ‌వుతారు. కాగా, ప్ర‌యాగ్‌రాజ్ లో గ‌త నెల 13 నుంచి ప్రారంభ‌మైన మ‌హాకుంభ‌మేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాదిగా భ‌క్తులు పోటెత్తుతున్నారు. ఈనెల 26 వ‌ర‌కు కుంభ‌మేళా జ‌ర‌గ‌నుంది.

Next Story