- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:మంత్రి లోకేష్ చొరవ..ఆ గ్రామానికి బస్సు సర్వీసు!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చిన తనకు ఒక్క మెయిల్ చేయండి..సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మంత్రి లోకేష్ ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు దగ్గరుండి వింటూ పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తమ ఊరికి బస్సు ఫెసిలిటీ కల్పించాలన్న విద్యార్థులు మంత్రి లోకేష్‌కు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా హొళగుంద మండలం మార్లమడి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీస్ లేదు. దీంతో తమ గ్రామానికి బస్సు నడపాలని కోరుతూ విద్యార్థి సంఘాలు మంత్రి లోకేష్‌కి మెయిల్ ద్వారా మెసెజ్ పంపారు. వెంటనే ఆ విషయం స్పందించిన నారా లోకేష్..ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే మార్లమడికి కొత్త బస్సు సర్వీసును ఆదోని ఆర్టీసీ డిపో అధికారులు ప్రారంభించారు. దీంతో మంత్రి లోకేశ్‌కు గ్రామస్థులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.