టీడీపీని కబ్జా చేసేందుకే బాలయ్య, యనమల ప్రయత్నం..!

by srinivas |   ( Updated:2023-09-12 07:20:46.0  )
టీడీపీని కబ్జా చేసేందుకే బాలయ్య, యనమల ప్రయత్నం..!
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీని కబ్జా చేసేందుకే నందమూరి బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. చంద్రబాబు జైలుకెళ్లడంతో పార్టీని గుంజుకునేందుకు వారు రివ్యూలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సమయంలో యనమల కూడా ఉన్నారని గుర్తు చేశారు. ఆనాడు స్పీకర్‌గా ఉన్న యనమల తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌కు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పారు. లోకేశ్ వల్ల ఏమీ కాదని, అందుకే బాలకృష్ణ, యనమల పార్టీ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారని మంత్రి కారుమూరి ఆరోపించారు. పోలీసుల ఎదుటే నారా లోకేశ్ బూతులు మాట్లాడుతున్నారని.. ఆయన అసెంబ్లీలో కూర్చోబెడితే ఏం మాట్లాడతాడనేది అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. పార్టీని కబ్జా చేసే పనిలో బాలకృష్ణ, యనమల ముందున్నారని మంత్రి కారుమూరి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story