- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం.. కారణం ఆయనేనంటూ మంత్రి గొట్టిపాటి ఫైర్

దిశ, వెబ్ డెస్క్: గత ఐదేళ్ల పాలనలో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Minister Gottipati Ravi Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా(Prakasam District) కొరిశపాడు మండలం పమిడిపాడు(Pamidipadu)లో సీసీ రోడ్లు, సైడ్ కాలువ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ చేతిలో అధికారం ఉందని జగన్ ఫ్యామిలీ(Jagan Family) ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. వివిధ పనుల కాంట్రాక్టుల రూపంలో మొత్తం 8 లక్షల కోట్ల రూపాయలు దోచుకుందని ఆరోపించారు. దుబారా, జల్సాలకు జగన్ ప్రభుత్వం రూ. 19, 871 కోట్లు వృధా చేసిందని వ్యాఖ్యానించారు. జగన్‌కు ప్రచార పిచ్చి ఎక్కువ అని, యాడ్ల రూపంలో తన సొంత పత్రికకు రూ. 1600 కోట్లు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్మేనని జగన్ అండ్ టీమ్ ఐదేళ్ల పాటు రూ. కోట్ల విలువైన ఎగ్‌పఫ్‌లను మేసేశారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి పేరుతో తెచ్చిన నిధుల్లో వేల కోట్ల కొట్టేశారని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు.
పది లక్షల కోట్లకు పైగా జగన్ అప్పులు
పది లక్షల కోట్లకు పైగా జగన్ అప్పులు చేశారని, అలా రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. ఆరోగ్య శ్రీని అధ్వాన్నంగా మార్చారని, రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులను జగన్ మోసం చేశారన్నారు. జగన్ సర్కార్ చెల్లించాల్సిన రూ. 22 వేల కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. జగన్ చేసిన దుర్మార్గపు పాలన వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకూపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా అప్పులు పుట్టని పరిస్థితి నెలకొందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల అసలు, వడ్డీతో కలిపి ప్రతి ఏడాది రూ. 71 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి గొట్టి పాటి రవికుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా సంక్షేమం, అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం వెనకడువేయడం లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి నేతలంతా కష్టపడి పని చేస్తున్నారని, జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.