- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap High Court, Secretariat నిర్మాణంపై మంత్రి అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి ప్రాంతంలో సచివాలయం, హైకోర్టును చంద్రబాబు నిర్మించిన విషయం తెలింసిందే. అయితే ఈ రెండు నిర్మాణాల్లో భారీగా అవినీతి జరిగిందని అసెంబ్లీ సాక్షిగా అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రజాధనం దోపిడీ చేశారని వివిధ పత్రికల్లో కథనాలు వచ్చాయని తెలిపారు. చంద్రబాబు దోపిడీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో రూ. 2 వేల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు పీఏ అవినీతిపై ఐటీశాఖ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. కొన్ని ఆధారాలు సేకరించినట్లు ఐటీ శాఖ తెలిపిందని అమర్‌నాథ్ వెల్లడించారు. ఏపీ సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందన్నారు. మనోజ్ వాసుదేశ్ 2019లో చంద్రబాబును కలిశారని అమర్‌నాథ్ పేర్కొన్నారు. మనోజ్ వాసుదేవ్ షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి అని తెలిపారు.
చంద్రబాబుకు రూ. 143 కోట్లు అందాయి...
తన పీఏ శ్రీనివాస్ ఆదేశాలు ఫాలో అవ్వాలని మనోజ్ వాసుదేవ్‌కు చంద్రబాబు చెప్పారని తెలిపారు. వంద కోట్లు ఫార్టీ ఫండ్ ఇవ్వాలని మనోజ్‌ను చంద్రబాబు పీఏ ఇవ్వాలని అడిగినట్లు అమర్‌నాథ్ చెప్పారు. వివిధ సంస్థలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చి నిధులు మళ్లించారని ఆరోపించారు. చంద్రబాబుకు, టీడీపీకి మొత్తంగా రూ. 143 కోట్లు నిధులు అందాయని అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి: