- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పసుపు బిల్లాతో వెళ్లండి.. మంత్రి అచ్చెన్నాయుడు వివాదస్పద వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి అధికారం చేపట్టి కొలువుదీరింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పాలనపై దృష్టి సారింది. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు వివాదస్పద వ్యాఖ్యలు చేసి వైరల్‌గా మారారు. వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందిపడ్డ టీడీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. మండల, జిల్లా ఆఫీసుల్లో పని ఉంటే పసుపు బిల్లను వెంటతీసుకెళ్లాలని సూచించారు. అక్కడ అధికారులు మీకు కూర్చీవేసి కూర్చోబెట్టి, టీ ఇచ్చి సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని చెప్పారు. ఇలా చేయకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వైరల్ అవుతున్న కామెంట్స్ ఇవే..
‘‘కార్యకర్తలు అధైర్య పడొద్దు, ఎవరూ ఇబ్బంది పడొద్దు. 18 గంటలు ఈ జిల్లా గురించి, కార్యకర్తల గురించి పని చేస్తాను. మీరు ఎప్పుడు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, ఏ పని చెప్పినా చేసి తీరతాను. ఐదేళ్లు అవస్థలు పడ్డారు. ఐదేళ్లు అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను. అధికారులతో నేను చెబుతాను. రేపటి నుంచి ప్రతీ కార్యకర్త ఎస్ఐ, ఎమ్మార్వో, ఎండీవో దగ్గరికి వెళ్లినా, ఏ ఆఫీసుకి వెళ్లినా.. మీరు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లండి.. మీకు గౌరవంగా కుర్చీ వేసి, టీ ఇచ్చి, మీ పనేంటి అని అడిగి మీ అందరికి పని చేయించే విధంగా అధికారులను లైన్‌లో పెడతా. ఎవరైనా ఒకరో ఇద్దరో అధికారులు నా మాట వినకపోతే ఏమవుతారో వారికి నేను చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడి కామెంట్స్ వైరల్‌గా మారాయి.