- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Crime News : ఏపీలో భారీ దోపిడీ.. నిందితుల అరెస్ట్

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని విజయవాడ(Vijayawada)లో రూ.2.5 కోట్ల రూపాయల విలువైన భారీ దోపిడీ(Robbery) జరిగింది. పోలీసులు సకాలంలో స్పందించడంతో నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా.. చోరీ చేసిన వస్తువులను రికవరీ చేశారు. విజయవాడ పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్(UP) కు చెందిన దీప్ చంద్ కార్ ట్రావెల్స్ నిర్వహిస్తాడు. చిన్న చిన్న కూలి పనులు చేసుకునే అతని ఫ్రెండ్స్ తో కలిసి ఏదైనా పెద్ద దొంగతనం చేసి, జీవితంలో సెటిల్ అవుదాం అని చర్చించాడు. విజయవాడలో వేర్ హౌస్(Where House) గోడౌన్లలో పని చేసే రంజిత్ వీరికి తోడవ్వడంతో మొత్తం అరుగురితో కలిసి ఈనెల 5న కారులో విజయవాడ చేరుకున్నారు. దోపిడీ కోసం రెక్కీ నిర్వహించి, మొదట గోడౌన్ రేకులు కట్ చేసి లోపలికి ప్రవేశించారు.
అనంతరం సీసీ కెమెరా వైర్లు కట్ చేశారు. గోడౌన్లో ఉన్న రూ.2.5 కోట్ల విలువైన ఐ ఫోన్లు, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలను ఎత్తుకుపోయారు. మరుసటి రోజు వేర్ హౌస్ యజమాని దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రత్యేక బృందాలతో కలిసి రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం జరిగిన పటమట ప్రాంతంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. అనుమానస్పదంగా కనిపించిన దీప్ చంద్ గ్యాంగ్ గురించి విచారిస్తూ వెళ్ళగా.. దొంగతనానికి ఉపయోగించిన కారు బీహార్లో(Bihar) ఉన్నట్టు గుర్తించి, బీహార్ పోలీసులకు సమాచారం అందించారు. బీహార్ పోలీసుల సాయంతో నిందితులను అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు.. మీడియాకు వివరాలు అందజేశారు. మరికొద్ది గంటల ఆలస్యం అయితే చోరీ చేసిన వస్తువులను నేపాల్ కు తరలించేవారని, సకాలంలో ఏపీ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.