- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Breaking: ఏపీ, తెలంగాణ సరిహద్దులో అలజడి.. కీలక మావోయిస్టు సోడిపొజ్జ అరెస్ట్

దిశ, వెబ్ డెస్క్: మావోయిస్టు సోడిపొజ్జ(Sodipojja) అలియాస్ లలిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitaramaraju District) ఎటపాక మండలంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లలిత్ వద్ద గ్రెనేడ్(Grenade), మావోయిస్టు కరప్రతాలు(Maoist pamphlets), రూ. 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. రహస్య ప్రాంతంలో ఆయన్ను విచారిస్తున్నారు. మవోయిస్టుల కదలికలు, స్థావరాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లలిత్ అరెస్ట్‌ను పౌర హక్కుల సంఘం నేతలు ఖండించారు. లలిత్‌ను వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఘటనల దృష్ట్యా సోడిపొజ్జను ఎన్ కౌంటర్ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసుల విచారణ తర్వాత లలిత్‌ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లలిత్ అరెస్ట్‌తో ఏపీ, తెలంగాణ సరిహద్దు ఏజెన్సీలో కలకలం రేగింది.
కాగా గత కొన్ని రోజులుగా మావోయిస్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(Central and State Governments) ఫుల్ ఫోకస్ పెట్టాయి. మావోయిస్టుల ఏరివేతకు యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)తో పాటు పలు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికపై నిఘా పెట్టాయి. చిన్న సమాచారం అందినా.. వెంటనే బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మవోయిస్టుల కోసం జల్లెడపడుతున్నాయి. కొన్ని సమయాల్లో ఎన్ కౌంటర్ చేస్తున్నాయి. మరి కొన్ని సందర్భాల్లో మావోయిస్టులను సురక్షితంగా పట్టుకుంటున్నాయి.
అయితే ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం మావోయిస్టుల ఎన్‌కౌంటర్లు భారీగా జరుగుతున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అబూజ్ మడ్, బీజాపూర్, సుకుమా జిల్లాల్లో వరుస ఎన్ కౌంటర్లు కొనసాగుతున్నాయి. పదుల సంఖ్యంలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. అటు భద్రతా సిబ్బంది కూడా అమరులవుతున్నారు. జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చినా మావోయిస్టులు మాత్రం కార్యచరణలను కొనసాగిస్తున్నారు. పలు చోట్ల బాంబులు పెట్టి విఫలమయ్యారు. పలుచోట్ల పెట్టిన బాంబులను చాకచక్యంగా భగ్నం చేశారు. మరికొన్ని చోట్ల చేసిన తనిఖీల్లో పలువురు మావోయిస్టులు తారస పడటంతో ఎదురు కాల్పులకు దిగారు. దీంతో అటవీ ప్రాంతాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో కూంబింగ్‌లను మరింత ముమ్మరం చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, మావోయిజాన్ని వదిలి సాధారణం జనంలోకి రావాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఈ పిలుపుతో కొన్ని చోట్ల పోలీసుల సమక్షంలో పలువురు మాయిస్టులు లొంగిపోయారు. మరి మిగిలిన మావోయిస్టుల్లోనూ కదలిక వస్తుందేమో చూడాలి.