భార్యను డ్రాప్ చేసేందుకు వచ్చి మృత్యుఒడిలోకి..

by S Gopi |
భార్యను డ్రాప్ చేసేందుకు వచ్చి మృత్యుఒడిలోకి..
X

దిశ, డైనమిక్ బ్యూరో: డ్యూటీకి వెళ్తున్న భార్యను డ్రాప్ చేసేందుకు వచ్చి భర్త మృత్యుఒడికి చేరాడు. దీంతో భార్య గుండెలు పగిలేలా రోదిస్తుంది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లా కావలి డిపోలో చోటు చేసుకుంది. కావలి ఆర్టీసీ డిపోలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బైక్‌పై దూసుకెళ్లింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అయితే మృతుడు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుభాషిని భర్త సుబ్బారాయుడు అని నిర్ధారణ అయ్యింది. సుభాషిణిని డ్యూటీ నిమిత్తం డిపోలో వదిలిపెట్టి వెళ్తుండగా బస్సు దూసుకువచ్చిందని, ఈ ప్రమాదంలో సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకుని విచారణ చేపట్టారు. తనను డ్రాప్ చేసేందుకు వచ్చిన భర్త ఇలా కళ్లెదుటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆమె విలపిస్తున్న తీరు అందర్నీ కంటతడిపెట్టిస్తోంది.

Advertisement

Next Story