మలివిడత‘నిజం గెలవాలి’: నవంబర్ 1 నుంచి ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటన

by Seetharam |
మలివిడత‘నిజం గెలవాలి’: నవంబర్ 1 నుంచి ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటన
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు జరగనుంది. నవంబర్ 1వ తేదీ నుండి 3 తేదీ వరకు నారా భువనేశ్వరి మలివిడత నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై మనోవేదనతో మృతి చెందిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తారు. నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, 2న విజయనగరం జిల్లాలోని ఎచ్చర్ల, బొబ్బిలి, 3న విజయనగరం నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొంటారు. బాధిత కుటుంబాలను పరామర్శించడంతోపాటు నిజం గెలవాలి సభల్లో ఆమె పాల్గొంటారు.

రైలు ప్రమాద బాధితులకు పరామర్శ

ఇకపోతే నారా భువనేశ్వరి విజయనగరం రైలు ప్రమాద బాధితులను ఈనెల 31న ఆసుపత్రిలో పరామర్శిస్తారు. మంగళవారం రాజమహేంద్రవరం నుండి బయలుదేరి విజయనగరం ప్రభుత్వాసుపత్రికి వెళతారు.బాధితుల పరామర్శ అనంతరం ఆముదాలవలస వెళ్లి అక్కడ బస చేస్తారు. బుధవారం నుండి మూడు రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొంటారు.

Advertisement
Next Story

Most Viewed