Rain Alert:బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండ్రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

by Jakkula Mamatha |   ( Updated:2024-11-23 10:30:09.0  )
Rain Alert:బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండ్రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశలో వాయుగుండంగా మారే అవకాశముంది. ఆగ్నేయ బంగాళాఖాతం(Southeast Bay of Bengal)లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా మారనుంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో మధ్య భాగాలపై నవంబర్ 25న వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ తదుపరి రెండు రోజుల్లో తమిళనాడు-శ్రీలంక తీరాలు(Tamil Nadu-Sri Lanka coasts) వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో మరో 8 రాష్ట్రాలకు భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ క్రమంలో మరో రెండ్రోజుల్లో వాయుగుండంగా మారనుండటంతో ఏపీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు(Officials of Meteorological Department) తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 27, 28 తేదీల్లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే వాయుగుండం ప్రభావం వల్ల చాలా చోట్ల వడగళ్ల వానలు కురిసే ఛాన్స్ ఉందని, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ( Meteorological Department) అధికారులు సూచించారు. ఏపీతో పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపురలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed