లవ్ ఫెయిల్యూర్: సాఫ్ట్ వేర్ ఉద్యోగి సూసైడ్

by Seetharam |
లవ్ ఫెయిల్యూర్: సాఫ్ట్ వేర్ ఉద్యోగి సూసైడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రేమ విఫలం కావడంతో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడివరానికి చెందిన పి.రాంప్రసాద్ (30) విశాఖలోని శంకరమఠంలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సీతంపేటలోని గణేశ్ నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు ఉంటున్నాడు. అయితే ఆకస్మాత్తుగా మంగళవారం ఉదయం తన నివాసంలోని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంప్రసాద్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న స్నేహితుడు ద్వారకా పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాంప్రసాద్ గదిని పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది. ప్రేమ ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాంప్రసాద్ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు ఎస్ఐ ధర్మేంద్ర వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed