లోకల్, నేషనల్..ఇంటర్నేషనల్ : పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ ఫైర్

by Seetharam |
లోకల్, నేషనల్..ఇంటర్నేషనల్ : పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పెళ్లిళ్లపై సీఎం వైఎస్ జగన్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. వేదిక ఏదైనా పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు దత్తపుత్రుడు అని మూడు పెళ్లిళ్లు అంటూ సీఎం జగన్ విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. అయితే కాకినాడ జిల్లా సామర్లకోటలో జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదాబాద్ అని... కానీ ఆయన ఇల్లాలు మాత్రం మూడేళ్లకో, నాలుగేళ్లకో ఒకసారి మారుతుందంటూ తీవ్ర వ్యాక్యలు చేశారు. చంద్రబాబు దత్తపుత్రుడి స్టోరీ మీకు తెలిసిందేనంటూ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల అంశాన్ని సీఎం జగన్ ప్రత్యేకంగా విమర్శలు చేశారు. ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్నేషనల్ అంటూ పవన్ కల్యాణ్ భార్యలను ఉద్దేశిస్తూ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి జగన్ ప్రస్తావించారు. ఇది దత్తపుత్రుడికి మహిళలపై ఉన్న గౌరవమని ఆరోపించారు. వివాహ వ్యవస్థపై పవన్ కల్యాణ్‌కు గౌరవం లేదని ధ్వజమెత్తారు. ప్యాకేజీ స్టార్‌కు గాజువాక, భీమవరంతో సంబంధం లేదని పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ విమర్శలు చేశారు.

సొంత పార్టీని అమ్ముకున్న పవన్

జనసేన పార్టీపైనా..జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యవహార శైలిపైనా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరుకులను అమ్ముకొనే వాళ్లను చూశాం.. కానీ సొంత పార్టీని అమ్ముకొనే వాళ్లను ఇప్పుడే చూస్తున్నామంటూ మండిపడ్డారు. అభిమానుల ఓట్లను హోల్ సేల్‌గా అమ్ముకొనేందుకే ప్యాకేజీ స్టార్ పర్యటనలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సొంతపార్టీని, సొంత వర్గాన్ని అమ్ముకొనే వ్యాపారి అని పవన్ కల్యాణ్‌పై జగన్ విమర్శలు చేశారని మండిపడ్డారు.రెండు షూటింగ్‌ల మధ్య అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి పోతుంటారని పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ నిప్పులు చెరిగారు.

Advertisement

Next Story