లిక్కర్ స్కాం కేసు: MP మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు

by Sathputhe Rajesh |
లిక్కర్ స్కాం కేసు: MP మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఈ కేసులో వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే ఈ కేసులో ఈడీ గతంలో ఎంపీ కుమారుడు మాగుంట రాఘవను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్ నుంచి విజయ్ నాయర్ ద్వారా ఆప్ పార్టీకి ముడుపులు అందించారనే అభియోగాల్లో భాగంగా రాఘవపై ఈడీ చర్యలకు ఉపక్రమించింది. అయితే ఇదే కేసులో ఈనెల 20న ఈడీ విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది.



Next Story

Most Viewed