Ambati Rayudu : ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకుందాం : అంబటి రాయుడు

by M.Rajitha |
Ambati Rayudu : ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకుందాం : అంబటి రాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఏబీవీపీ(ABVP) కార్యకర్తలు అందరూ విద్యార్థి నాయకులు కాబట్టి తప్పులు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని భారత మాజీ స్టార్ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు(Ambati Tirupati Rayudu) అన్నారు. శుక్రవారం నుంచి విశాఖపట్నం(Vishakhapatnam)లో జరుగుతున్న ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు కష్టపడటం అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ ప్రారంభోత్సవ సభ కు మాజీ శాసనమండలి సభ్యులు పివిఎన్ మాధవ్, కాంటినెంటల్ కాఫీ సంస్థ అధినేత చల్ల రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. గడిచిన కొంతకాలంగా భారతదేశ వ్యాపారవేత్తలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుందని అందుకని యువత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా చక్కని వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఉద్యోగాలు సృష్టించే వ్యక్తులుగా గుర్తింపు పొందాలని అన్నారు.

Next Story