- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తక్కువ సమయంలోనే న్యాయం జరిగేలా చేయండి: NV Ramana
దిశ; వెబ్‌డెస్క్: విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసిన కోర్టు నూతన భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఏపీ సీఎం జగన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తాను శంకుస్థాపన చేసిన భవనానికి పదేళ్ల తరువాత తానే ప్రారంభోత్సవం చేయండం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ భవన ఆలస్యానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. కోర్టును న్యాయవాదులు, న్యాయమూర్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోర్టుల నిర్మాణం కోసం గతంలో తాను ప్రభుత్వాలను ప్రశ్నించడం జరిగిందని గుర్తుచేసుకున్నారు. ప్రజలకు తక్కువ సమయంలోనే న్యాయం అందించేలా న్యాయవాదులు సహకరించాలని విజ్ఙప్తి చేశారు. సమాజంలో శాంతియుతంగా ఉంటూ అన్ని వర్గాలు కలిసి ఉంటే అభివృద్ది సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు ఆర్థికంగా సహకరించాలని ఎన్వీ రమణ విజ్ఞప్తి చేశారు.