Tragedy: గోడ కూలి.. ఒకటో తరగతి విద్యార్థి మృతి

by srinivas |
Tragedy: గోడ కూలి.. ఒకటో తరగతి విద్యార్థి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: గోడ కూలి ఒకటో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా(Nandyala District)లో జరిగింది. నందికొట్కూరు(Nandikotkuru)లో విద్యార్థి మోహిన్(Student Mohin) ఉర్దూ స్కూలు(Urdu School)లో ఒకటో తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరే బుధవారం కూడా స్కూలుకు వెళ్లాడు. అయితే పాఠశాల స్కూలు ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో విద్యార్థి మోహిన్ అక్కడికక్కడే మృతి చెందారు. గోడ శిథిలాలను తొలగించి విద్యార్థి మోహిన్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా కనిపించే స్నేహితుడు మోహిన్ ఇక లేకపోవడంతో తోటి విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. మోహిన్ మృతితో స్కూలులో విషాదచాయలు అలుముకున్నాయి. తమ కుమారుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed