Kurnool: శ్రీరాముడి దేవాలయ భూములకు వేలం

by srinivas |   ( Updated:2023-04-07 13:11:48.0  )
Kurnool: శ్రీరాముడి దేవాలయ భూములకు వేలం
X

దిశ,చిప్పగిరి: కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం దౌల్తాపురంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవాలయాల భూములకు వేలంపాట నిర్వహించారు. దీంతో రైతులు పోటాపోటీగా వేలంలో పాల్గొన్నారు. దాదాపు 99 ఎకరాలకు ఆలయ ఈవో పి.ఎన్. రాధాకృష్ణ ఆధ్వర్యంలో వేలంపాట వేశారు. వేలం పాటలో పాల్గొనే రైతులతో ముందుగా ఐదు వేలు చొప్పున డిపాజిట్ చేయించారు. భూములు దక్కించుకున్న రైతులు రెండు లక్షల దాటిన భూములకు 50 వేల రూపాయలను చెల్లించేలా నిర్ణయించారు. ఇందుకు రైతులు సమ్మతించి వేలంపాటలో పాల్గొన్నారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వేలం పాట ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, గ్రామస్తులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవమ్మ, మాజీ దేవాలయ చైర్మన్ మేకల దామోదర్ దేవాలయ సిబ్బంది శ్రీనివాసులు, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి: గుడ్ ఫ్రై డే ప్రార్థనలలో మాజీమంత్రి కొడాలి నాని

Advertisement

Next Story