Kurnool: సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు సర్వం సిద్ధం

by srinivas |
CM Jagan Extends Raksha Bandhan Wishes to People of AP
X

దిశ, కర్నూలు ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి పత్తికొండ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలిపారు. బుధవారం కర్నూలు జిల్లా పత్తికొండలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ ఎన్.మౌర్యతో కలిసి సెయింట్ జోసెఫ్ పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేస్తున్న వేదికను కలెక్టర్ పరిశీలించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీకి సూచించారు. సభా ప్రాంగణంలో ఉన్న కంపార్టుమెంట్లలో ఏ గ్యాలరీకి సంబంధించిన ఆ గ్యాలరీ నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. సభా ప్రాంగణానికి వచ్చే ప్రజలు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అలాగే మజ్జిగ, తాగు నీరు, స్నాక్స్ ప్రతి ఒక్కరికీ

ఇచ్చిన తర్వాత వాటిని మరలా తిరిగి డస్ట్ బిన్‌లో వేసే విధంగా పారిశుధ్య కార్మికులను సభా ప్రాంగణంలో కేటాయించి ప్రాంగణమంతా శుభ్రంగా ఉండే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టేజ్ పైన ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజలిచ్చిన గ్రీవెన్స్‌లో ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదన్నారు. ప్రజలిచ్చిన గ్రీవెన్స్‌కి తగిన ఎండార్స్‌మెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీని అదేశించారు. తదనంతరం పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు.


పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పత్తికొండ నియోజకవర్గానికి తొలిసారిగా వస్తున్నారని, అధికారులంతా సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. పత్తికొండ ప్రజల చిరకాల వాంఛ రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారని, అందుకోసం పత్తికొండ ప్రజలు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ(ఎస్ఎస్జి) రాజారెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనరేట్ జేడీ శ్రీధర్, పత్తికొండ ఆర్డీఓ మోహన్ దాస్, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రమణ కాంత్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నా

Advertisement

Next Story