గుండ్లకమ్మ వాగు పూడిక తీయండి: సీపీఎం డిమాండ్

by Jakkula Mamatha |
గుండ్లకమ్మ వాగు పూడిక తీయండి: సీపీఎం డిమాండ్
X

దిశ, ఆత్మకూరు: పట్టణంలో నంద్యాల రోడ్డు నుంచి దుద్యాల రోడ్డులోని భవనాసి వాగు వరకు ప్రవహించే గుండ్ల కమ్మ వాగులో పూడిక తీసి వరదల నుంచి పలు కాలనీలోని ప్రజలను కాపాడాలని సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ.రణధీర్, శాఖ కార్యదర్శి ఏ.సురేంద్రలు సంబంధిత అధికారులను కోరారు. ఆదివారం పట్టణంలోని గరీబ్ నగర్ 19 వ వార్డులో సీపీఎం పార్టీ ప్రజా చైతన్య యాత్ర నాలుగో రోజు సందర్భంగా కాలనీలో సీపీఎం పార్టీ పట్టణ నాయకులు పర్యటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలో గుండ్లకమ్మ వాగు వెంబడి పలు కాలనీలో ప్రజలు అనేక సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. కానీ గుండ్లకమ్మ వాగులో పూడిక తీయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రకృతి వైపరీత్యం కన్నేర చేసినప్పుడు ఆ వాగు వెంబడి ఉన్న హుస్సేన్ సా నగర్, లక్ష్మీ నగర్, పద్మావతి నగర్, ఏకలవ్య నగర్, ఇంద్రానగర్, గరీబ్ నగర్ తదితర కాలనీలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కంటితుడుపు చర్యగా చర్యలు చేపడతారు. తప్ప శాశ్వత పరిష్కారం చేసే వైపు అడుగులు వేసే ఎటువంటి పరిస్థితుల్లో లేరు. కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు గుండ్లకమ్మ వాగులో పూడిక తీసి పహరి గోడ నిర్మించి పట్టణంలోని పలు కాలనీలో ప్రజలను వరదల నుంచి కాపాడాలని వారు సిపిఎం పార్టీగా డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి గుండ్లకమ్మ వాగు మొత్తం పూడిక తీసి ప్రహర గోడ నిర్మించి ప్రజలను అంటురోగాలు వరద బాధితుల నుంచి కాపాడాలని కోరారు. ఈ ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకులు డి రామ్ నాయక్, వీరన్న, పి భాస్కర్, మహిళా సంఘం నాయకురాలు ఏ సువర్ణమ్మ, నాయకులు ఏ కిరణ్, శాలు, నబి, కాలనీ ప్రజలు శారద, లక్ష్మీదేవి, అమినాబి సువర్ణ, సులోచన, సువర్ణ మాలంబి, చంద్రకళ గౌస్, మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed