Srisalam Temple వద్ద దుకాణాలకు బోర్డులు తప్పనిసరి

by srinivas |   ( Updated:2023-01-13 15:24:59.0  )
Srisalam Temple వద్ద దుకాణాలకు బోర్డులు తప్పనిసరి
X

దిశ, శ్రీశైలం: శ్రీశైలం క్షేత్రం వద్ద ఏర్పాటు చేసుకున్న దుకాణదారులు వస్తువుల ధరలకు సంబంధించిన బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ కె.రఘువీర్ తెలిపారు. అన్ని భాషలు మాట్లాడే వారు వేల సంఖ్యలో శ్రీశైలం వస్తుంటారన్నారు. వారికి సరుకులు, వస్తువుల రేట్ల విషయంలో సందేహాలు, అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా ఉండేలా వాటి రేట్లు బహిర్గత పరిచేలా వ్యాపార సముదాయాల ముందు తప్పనిసరిగా ధరలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న చిన్న హోటళ్లు, టీ స్టాల్స్ తదితర వ్యాపార సముదాయాలు కలిగిన యజమానులు, అమ్మకందారులు, నిర్వాహకులు వాళ్ల షాపుల్లో విక్రయించే వాటికి సంబంధించిన వివరాలను నాలుగు భాషల్లో ధరలను చూపించే బోర్డులను తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, హిందీ భాషలలో సులభంగా కనపడే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, అధిక ధరలకు వస్తువులు విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే 9121101192, 9121101193 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కె.రఘువీర్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed