Ap Govt: జగనన్న భూహక్కు పత్రాలు కావాలంటే ఈ పని కచ్చితంగా చేయాల్సిందే..!

by srinivas |
Ap Govt: జగనన్న భూహక్కు పత్రాలు కావాలంటే ఈ పని కచ్చితంగా చేయాల్సిందే..!
X

దిశ, కర్నూలు ప్రతినిధి: జగనన్న భూహక్కు పత్రాల పంపిణీ సమయంలో ఈ-కేవైసీ తప్పనిసరిగా చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడ నుంచి జగనన్న భూహక్కు, భూరక్ష (రీసర్వే), ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, జగనన్నకు చెబుదాం అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి మాట్లాడారు. జగనన్న భూహక్కు రీసర్వేలో భాగంగా ఫేజ్-2 గ్రామాలకు సంబంధించి డేటా ఎంట్రీ జూలై 31 నాటికి పూర్తి చేయడంతో పాటు ఎంట్రీ పూర్తైన వాటికి 31వ తేదీ, ఆగస్టు నాటికి ఫైనల్ ఆర్ఓఆర్ పూర్తి చేసి పబ్లికేషన్ పూర్తి చేయాలన్నారు. సరిహద్దు రాళ్లను కూడా సెప్టెంబరు 30 నాటికి ఏర్పాటు చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. అదే క్రమంలో ఎలాంటి తప్పుల్లేకుండా భూహక్కు పత్రాలు ప్రింటింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రింటింగ్ పూర్తైన తర్వాత భూహక్కు పత్రాల పంపిణీ సమయంలో తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని సీఎస్ ఆదేశించారు.


ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. అందుకు సరైన ప్రణాళిక వేసుకొని త్వరితగతిన నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చూడాలని చెప్పారు. గ్రామాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్లు సరైన సమయంలో పూర్తి చేయడంతో పాటు గతంలో నిర్మాణాల కోసం ఇచ్చిన ప్రతిపాదనలకు సంబంధించి సవరించిన అంచన ప్రతిపాదనలు అందజేయాలన్నారు.


జగనన్న చెబుదాంకు సంబంధించి టోల్ ఫ్రీ

నెంబర్ 1902 ద్వారా 74,168 అర్జీలు వచ్చాయని, వాటిలో 53,657 అర్జీలను (72 శాతం) సరైన సమయంలో బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించామన్నారు. అందులో వచ్చే నాన్ ఫైనాన్షియల్ సమస్యలకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించి. వాటిని సరైన రీతిలో పరిష్కరించే దిశగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కర్నూలు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed